గ్రామ పంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డు పంపిణీ చేయాలి
పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికై దేశవ్యాప్తంగా జూలై 9న సమ్మెను జయప్రదం చేయాలని
అగ్నిజ్వాలా ప్రతినిధి:యాలాల
యాలాల్ :తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) *ఆధ్వర్యంలో మండలం ఎంపీవో గారికి జులై 9న దేశవ్యాప్త సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సిఐటియు దేశవ్యాప్తంగా కార్మికుల సంఘాల సమ్మె జూలై 9 జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్, యు.బుగ్గప్ప లు మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు రాక చాలా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని గత సంవత్సరం కాలంగా పంచాయతీ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నదని ముఖ్యమంత్రి గారు స్వయంగా పంచాయతీ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ప్రతి నెల చెల్లిస్తామని జనవరిలో ప్రకటించినప్పటికీ నేటికి అది అమలు కాక సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల రాష్ట్రంలో అనేక మంది కార్మికులు ఎలక్ట్రిషన్ స్తంభాలు ఎక్కి నైపుణ్యం లేని పనులు చేయడం వల్ల ట్రాక్టర్ ఎక్కి నడుపుతూ చనిపోయారని వారి కుటుంబాలు వీధిన పడ్డాయని రాష్ట్రంలో 51 వేల మంది ఇన్సూరెన్స్ సౌకర్యం లేక చాలా నష్టపోతున్నారని 40 సంవత్సరాల నుండి పనిచేసిన కనీస వేతనం జాడేలేదని చట్టబద్ధమైన సౌకర్యాలు నోచుకోక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని అనేక సంవత్సరాలుగా పారిశుద్ధ్య పనులలో నిమగ్నమై గ్రామాలను సస్యశ్యామలంగా ఉంచుతున్న వీరి పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను అవలంబిస్తుందని స్వయంగా పంచాయత్ శాఖ మంత్రి మా ప్రభుత్వం ఏర్పడితేమల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేస్తామని కనీస వేతనాలు అమలు చేస్తానని మాట ఇచ్చి తప్పుకున్నారని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చర్చలు సందర్భంగా 14 డిమాండ్ ను పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేస్తానని నెలరోజులోవాటిని పరిష్కరిస్తామని పట్టించుకున్న పాపాన పోలేదని వేతనాలు ఏ అధికారిని అడిగిన సరైన సమాధానం లేదని అందుకే రాష్ట్రవ్యాప్తంగా జూలై 9 న దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయండి ఈలోపు ప్రభుత్వము అంగీకరించిన డిమాండ్స్ పై ఉత్తర్వులు జారీ చేయాలని లేనియెడల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్మికులందరు దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు.
గ్రామ పంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డుల* *పంపిణీ మండలలోని గ్రామ పంచాయతీ కార్మికులకు ఎంపీవో యాదయ్య గారు కార్మికులకు గుర్తింపు కార్డు లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీవో మాట్లాడుతూ..కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విదంగా కార్డులను అందించడం చాలా మంచి పరిణామం అన్నారు.ప్రభుత్వం ఇచ్చిన గ్రామంలో పనిని శ్రద్దతో చేసి ప్రభుత్వనికి మంచి పేరు తీసుకొని రావాలని అన్నారు.గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు ఆరిఫ్,కార్మికులు షేబ్బీర్, శ్యామమ్మ, అంతమ్మ, చంద్రప్ప, మొగులప్ప, లక్ష్మి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు…

