ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన పరిగి తహసీల్దార్ ఆనందరావును వెంటనే సస్పెండ్ చేయాలని నిరస
అగ్ని జ్వాలా ప్రతినిధి:వికారాబాద్ జిల్లా
వికారాబాద్ :పరిగి మండలం, రంగం పల్లి గ్రామానికి చెందిన 1-00 ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన,అదే గ్రామంలో 20-23 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమార్కులకు కట్టబెట్టి,గోవిందాపూర్ గ్రామం రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 95 లో 16-00 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి,అక్రమ మట్టి వ్యాపారస్టలతో కుమ్మకై మట్టి వ్యాపారం చేస్తున్న పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు ను వెంటనే సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చెయ్యడం జరిగిందిఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్. మహిపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఉ. బుగ్గప్ప,ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చెంద్రయ్య, కే శ్రీనివాస్,DYFI జిల్లా నాయకులు సతీష్, మాట్లాడుతూ..పరిగి మండలం,రంగంపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 146 మొత్తం విస్తీర్ణం :4-17ఎకరాలు కలదు. ఈ భూమి ఖారేజ్ ఖాతా (సర్కారి) భూమి కొంతమంది పేదలు ఖాస్తులో ఉండగా వారిని జీవనదారం కొరకు కొందరికి పాసుబుక్కులు ఇచ్చారు. ఇట్టి భూమి అమ్మడం కొనడం నేరం, కాని ఈ భూమిలో నుంచి మన పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు మాత్రం డబ్బులకు ఆశపడి ప్రభుత్వ భూమిని తేది :09.09.2024 నాడు 1-00 ఎకరం భూమిని వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ భూమి మళ్ళీ వేరే వ్యక్తులకు అమ్మడానికి స్లాట్ బుక్ చేయడం చేసి వేరే వ్యక్తులకు అమ్మడానికి ప్రయత్నించగా ఆ భూమి ప్రభుత్వ భూమి అని ఇది రిజిస్ట్రేషన్ చెయ్యడానికి విలులేదు అని అధికారులు చెప్పారు.ఈవిషయంబాధితులురాజకీయనాయకులను,ఇతరులను ఆశ్రహించగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ బండారం బయటపడింది. పహాని రికార్డ్ లో ఈ భూమి స్వబావం 1954-55(ఖస్రా),1955-56(చసాల) ఖరీజఖాతా (సర్కారి) భూమిని పేర్కొనబడినది. అంటే ఇది ప్రభుత్వ భూమి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చెయ్యడం చట్టావిరుద్ధం.రంగంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 256 విస్తీర్ణం:20-23 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి కలదు. ఇందులో కొంత భూమి కొంత మంది పేదలకు అస్సైన్ చేసి పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. మరికొంత సీలింగ్ భూమి చెట్లు,గుట్టలు కలవు. ఈ భూమిలో 15 నెలలుగా రియల్టర్లు జేసీబీలతో చదును చేస్తూ చెట్లు, గుట్టను తవ్వుతున్న తహశీల్దార్ మాత్రం వారితో కుమ్మకై చూసి చూడనట్లు వ్యవరిస్తున్నాడు . గోవిందా పూర్ చెందిన సర్వే నెంబర్ 95 లో 16 ఎకరాల సీలింగ్ భూమి తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేశాడు పరిగి మండలంలో అక్రమ మట్టి వ్యాపారులతో కుమ్మకై రాత్రి,పగలు తేడా లేకుండా మట్టి దందా కొనసాగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నడు గతంలో ఆనంద్ రావు తహశీల్దార్ గా పని చేసిన దుద్యాల మండలం గౌరారం గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తిగారి తండ్రి గారు చనిపోతే కుమారునికి విరసత్ చేయకుండా లక్షల రూపాయలు తీసుకొని వేరే వ్యక్తులకు పట్టా చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ పిర్యాదు చేసిన పట్టించుకోలేదు .అందుకే అదే దిమాతో ఈలాంటి అవినీతి ,అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీంతో అనేక పరిగి తహశీల్దార్ అవినీతి ,అక్రమాలకు పాల్పడుతున్నాడు. అందుకని పరిగి తాహసిల్దార్ పై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా కమిటి డిమాండ్ చేస్తుంది.

