బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వకపోవడం అన్యాయం
ముగ్గురు బీసీ ఎంపీలు సీనియర్ నేతలు ఉన్న అవకాశం ఇవ్వలేదు
రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు ఇచ్చుంటే బిజెపి బలపడేది
బీసీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నామినేషన్ కు అనుమతించకపోవడం దుర్మార్గం
–జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు కేటాయించడం బీసీలను విస్మరించడమే కాకుండా తీవ్ర అన్యాయం చేశారని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ విమర్శించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ముగ్గురు బీసీ ఎంపీలకు బీసీ ఎమ్మెల్యేకు అనేకమంది బీసీ సీనియర్ నేతలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అవకాశం కల్పించలేదని రాజ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు గతంలో బీసీల ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని కనీసం శాసనసభ పక్ష నేతగా కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఒక బీసీ నాయకుని రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తారని అనుకున్న చివరి క్షణంలో బీసీలకు మొండి చేయి చూపిందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలపడేదని అన్నారు బిసి ఎమ్మెల్యే రాజాసింగ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్ కు అనుమతించకపోవడం దుర్మార్గమైన చర్య అని రాజ్ కుమార్ అన్నారు

