ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

* తాండూరు నిరుద్యోగ యువతకు ఉత్తమ భవిష్యత్తు అందించడమే లక్ష్యం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

* మెగా జాబ్ మేలను నేతలు జయప్రదం చేయాలి  

అగ్నిజ్వాలా ప్రతినిధి:వికారాబాద్ జిల్లా

తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉత్తమ భవిష్యత్తు అందించడమే ధ్యేయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మే 29న మెగా జాబ్ మేళా పోస్టర్ ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ.సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్న ట్లు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మెగా జాబ్ మేళా కొనసాగుతుందని వివరించారు.ఈజి ఎంఎం  వారి ఆధ్వర్యంలో సుమారు 50 కంపెనీల ప్రతినిధులు, 10 వేల ఉద్యోగాలు యువతకు కల్పించనున్నట్లు తెలిపారు.పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన నిరు ద్యోగులు పాల్గొనవచ్చునని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి నిరుద్యోగులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు.. స్థానిక నాయకులు యువతకు జాబ్ మేళాపై అవగాహనా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సొంత ప్రోగ్రాం అనుకుని, అందరికి ఉద్యోగం వచ్చే విధంగా పత్రిక, మీడియా సోదరులు కూడా కృషి చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *