విద్యతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు 

విద్యతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు 

 

 

సింధు డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

అగ్ని జ్వాల ప్రతినిధి: తాండూర్ 

తాండూర్ : విద్యార్డులు విద్యతో పాటు మంచి వ్యక్తిత్వం అలవర్చుకోవా లని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం తులసీ గార్డెన్ లో సింధు డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సేవాభావం, పోటీతత్వం అలవరచుకోవాలని..ఉన్నత లక్ష్యంతో చదివి ముందుకు వెళ్లాలన్నారు. విద్యతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.నేటి విద్యా విధానాన్ని అనుసరిస్తూ విద్యార్థులు ఉన్నత స్థాయిని అధిరోహించాలన్నారు.ప్రతి విద్యార్థీ సమాజంలో క్రమశిక్షణతో నడవాలని, విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమా లు అందరినీ ఆకట్టుకున్నాయి.కళాశాల డైరెక్టర్ రంగారావు,ప్రిన్సిపల్ విజయా దేవి, వైస్ ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *