సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేసి సన్న బియ్యం ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
ధనికులు తినే సన్నబియ్యం ఉచితంగా పేదలకిస్తున్నాం – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్ అగ్నిజాల ప్రతినిధి :
తాండూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు రాజీవ్ కాలనీ, 17వ వార్డు పాత తాండూరులో ప్రజాపాలనలో భాగంగా పేదలకు అందించే ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.. స్థానిక నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే బీఎంఆర్ గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..రా
ష్ట్రంలో పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన గొప్ప పథకం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.తాండూరు నియోజకవర్గంలో 2,31,260 మంది లబ్ధిదారులకు నెలకు దాదాపు 1500 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా అందిస్తామన్నారు.ప్రతి నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం అందించడం జరుగుతుంది.త్వరలో సన్నబియ్యంతో పాటు 9 రకాల సరుకులతో కూడిన రేషన్ కిట్టు ప్రభుత్వం ప్రారంభించబోతుంది.ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని తెలిసిన, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు నెలకి ఈ పథకం ద్వారా 2000-3000 రూపాయలు ఆదా అవుతాయి.నిరుపేదలకు సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతోనే సన్నరకం వడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించడం జరిగింది.గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పంపిణీతో నిరుపేదలు కడుపు నిండా భోజనం చేయలేకపోయారు. అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు..

