కరణ్ కోట్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
—సన్నబియ్యం ప్రారంభించిన ఘనత సిఎం రేవంత్ రెడ్డిదే
—ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
అగ్నిజ్వల ప్రతినిధి:తాండూర్
తాండూర్: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పథకం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అని వికారాబాద్ జిల్లా తాండూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు.శుక్రవారం మండల పరిదిలోని కరణ్ కోట్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిత్ర పటానికి నాయకులుపాలాభి షేకం చేశారు. ఈ సందర్బంగా తాండూర్ మండల కాంగ్రెస్ నాయకులుమాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్,శరణు బసప్ప, సుదాకర్, భరత్ కిషోర్, తదితర నాయకులు, రేషన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

