దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేపట్టాలి
బీసీలకు విద్యా,ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రత్యేక రైలులో ఢిల్లీ బాట పట్టిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ మరియు తాండూర్ బీసీ సంఘం నాయకులు
తాండూర్ అగ్నిజాల ప్రతినిధి:
ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల పోరు గర్జనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో ఢిల్లీ బయలుదేరినట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో మరియు విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని యధావిధిగా పార్లమెంట్లో చట్టం చేయాలని 2025 లో జరిగే జనగణలో కులగన్న నిర్వహించాలని 50% పైగా ఉన్న ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో మొదటి నుంచి అన్యాయం జరుగుతునే ఉందని అన్నారు.ఒక బీసీ ప్రధానిగా ఉన్న బీసీలకు న్యాయం జరగట్లేదని విచారం వ్యక్తం చేశారు.ఢిల్లీకీ విక్రమ్ నరేష్ నరసింహ మల్లికార్జున్ పానగంటి విజయ్ వీరితోపాటు పెద్ద ఎత్తున బీసీ విద్యార్థి యువజన సంక్షేమ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు బయలుదేరడం జరిగింది.

