కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి, ఎన్నికల ముందు దళితులకు ఇచ్చిన హామీ అంబేద్కర్ అభయస్తం ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్
తాండూర్ :అగ్నిజ్వల ప్రతినిధి
సిపిఎం తాండూర్ నియోజకవర్గం పార్టీ ఆధ్వర్యంలోఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ ఈ సందర్భంగా *సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్, యు.బుగ్గప్ప* మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఇంత వరకు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు అదే విధంగా దళితులకు దళిత బందుకు బదులుగా అంబేద్కర్ అభయస్థం పేరుతోనే ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉంది అని అన్నారు ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చి 15 లక్షలు రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు ఇవ్వాలని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతుబంధు వేయాలని రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళ కి మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు 2500 రూపాయలు అకౌంట్లో వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలని మోసం చేస్తున్నారు వృద్ధులకు పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని వికలాంగులకు 6000 రూపాయలు,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి గ్యాస్ కు సబ్సిడీ డబ్బులు పడటం లేదు ఇంకా ప్రజలందరికీ గ్రామాలలో అరులైన వారికి ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి వాటి నిర్మాణానికి 15 లక్షలు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ సిపిఎం పార్టీ చేసే పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నర్సిములు వెంకట్ తదితరులు పాల్గొన్నారు