గ్రామపంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ ఎంపీడీవో ఎంపీవో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రామపంచాయతీ కార్మికులకు పంపిణీ సిఐటియు
అగ్నిజ్వల ప్రతి నిధి :
పెద్దెముల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు ఎంపీడీవో ఎంపీవో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికులకు గత రెండు, మూడు, నెలలుగా జీతాలు పెండింగ్ ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని, ఎస్ టి ఓ లో వేసిన చెక్కులు వెంటనే విడుదల అయ్యేలా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని, అప్పులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ గ్రామంలో పంచాయతీ కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితిలో దాపురించాయి,
గ్రామపంచాయతీ కార్మికులు పోరాటానికి సన్నద్ధం కాగానే మంత్రి సీతక్క ప్రెస్ మీట్ పెట్టి జనవరి నెల నుండి కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు అకౌంట్లో వేస్తామని చెప్పి రెండు నెలలు గడుస్తున్నా, హామీ హామీ గానే మిగిలిపోయింది గాని ఆచరణలో అమలు కావడం లేదు ఇది ఎక్కడి చోద్యం, మాటలు కోటలు దాటుతున్నవి తప్పితే చేతలు మాత్రం గడప దాటడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ కార్మికులను, ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని రానున్న రోజులలో కార్మికులందరూ ఐక్యం చేసి మరో పోరాటానికి సన్నద్ధం అవుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం సిఐటియు మండల నాయకులు రాజు గ్రామపంచాయతీ కార్మికులు మండల అధ్యక్షులు అంబరప్ప వీరప్ప లక్ష్మి సంగప్ప శ్రీనివాస్ పాల్గొన్నారు

