రాష్ట్రంలో ప్రజా పాలనలో విద్యకు పెద్దపీట వేశాం 

విద్యార్థి దశలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి 

* తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

* రాష్ట్రంలో ప్రజా పాలనలో విద్యకు పెద్దపీట వేశాం 

* యాలాల్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది

యాలాల :అగ్నిజ్వల ప్రతినిధి :

యాలాల్ మండలంలోని అగ్గనూర్, యాలాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల కార్పోరేషన్ ద్వారా మంజూరైన రూ.54 లక్షలతో నాలుగు అదనపు గదుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, శంకుస్థాపన చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.

ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులు, నాయకులు.

పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన అగ్గనూర్ విద్యార్థులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.

సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చక్కటి ప్రదర్శన చేశారని కొనియాడారు.

క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య అన్నింటిలో అగ్గనూర్ విద్యార్థులు ప్రతిభా కనబర్చడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

నేటి విద్యార్థులు మార్కులు, పరీక్షల కోసంకాకుండా జ్ఞానం సంపాదించే విధంగా విద్యార్థులు కృషి చేయాలి.

ప్రతి విద్యార్థి ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలి.

జన్మనిచ్చిన తల్లిదండ్రులను, చదువు నేర్పిన గురువులను, పెద్దలను గౌరవించడం విద్యార్థులు విధిగా అలవాటు చేసుకోవాలి.

రాష్ట్రంలో ప్రజా పాలనలో విద్యకు పెద్దపీఠ వేశాం. యాలాల్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. సంక్షేమ హాస్టళ్లు విద్యార్థులకు మెస్ కాస్మోటిక్స్ చార్జీలు పెంచడం జరిగింది. గ్రామం మరియు పాఠశాలలో గల పలు సమస్యలను దశలవారీగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని అన్నారుఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు నాయకులు, గ్రామస్తులు, విద్యార్థులు, పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *