* ఫోరం ఫర్ సివిల్ రైట్స్ (FCR) కన్వీనర్ న్యాయవాది కే గోపాల్.
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 6 నుండి 18 వరకు చేపట్టిన కులగనన సర్వేను పకడ్బందీగా చేపట్టాలి. ఈ సర్వే ఉద్దేశాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజలలోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా అన్ని రంగాలలో అణిచివేతకు గురవుతున్న వెనుకబడిన సామాజిక వర్గాలు ఈ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి. ఈ సర్వే పట్ల ప్రజలలో అవగాహన పెంచినప్పుడు మాత్రమే సర్వే అధికారులకు పూర్తి వివరాలు సేకరించడానికి సాధ్యమవుతుంది. దీనికోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
ముఖ్యంగా సమాజంలో ఉన్న వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ రంగాలలో ముందడుగు వేసేటట్లు ఈ సర్వే చేపట్టాలి.సర్వే అధికారులు ఓపికతో సమాచార సేకరణచెయ్యాలి.
ఆ తర్వాత సర్వే వివరాలు ప్రభుత్వం పబ్లిక్ డొమెన్లో పెట్టి పౌర సమాజం అభిప్రాయాన్ని సేకరించి చర్చ పెట్టాలి.
ఈ సర్వే వెనుకబడిన వర్గాలు స్వేచ్ఛగా వినియోగించుకొని సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయాలి. ఈ సర్వే విజయవంతం కావడానికి తాండూర్ ఫోరమ్ ఫర్ సివిల్ రైట్స్ ప్రజలలోకి వెళ్లి విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది. అని ఫోరం ఫర్ సివిల్ రైట్స్ (FCR) కన్వీనర్ న్యాయవాది కే గోపాల్. అన్నారు