కురువ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

ఎన్నికైన వారిలో  ఎంబిబిఎస్ గా వివేక్. బీఫార్మసీలో దీపిక. ఉపాధ్యాయునిగా బసప్ప

తాండూర్ :అగ్ని జ్వాలా ప్రతినిధి నూతనంగా ఎంబీబీఎస్ గా ఎన్నికైనటువంటి పూజారి నర్సింలు కుమారుడు పూజారి వివేక్ మరియు. బి ఫార్మసీ లో ఎన్నికైన ఇందూర్ బాలు కుమార్తె అయినా K.దీపిక మరియు ఉపాధ్యాయుడు ఎన్నికైన పగిడాల గ్రామం నెత్తి ఎల్లప్ప కుమారుడైన N. బసప్ప ఈ ముగ్గురికి ఈరోజు పట్టణంలో నాగారం నరసింహులు దుకాణంలో తాండూరు డివిజన్ కురువ సంఘం అధ్యక్షులు నాగారం జగదీశ్వర్ మరియు తాండూరు పట్టణ అధ్యక్షులు    నర్సింలు వారి ఆధ్వర్యంలో ఘనంగా శాల్వా పూలమాలతో సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తాండూరు డివిజన్ నాయకులు మండల్ అధ్యక్షులు తాండూరు పట్టణ కమిటీ సభ్యులు కుల బంధువులు మహిళా కమిటీ సభ్యులు కుల సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు