🔸యాలాల్ మండల పరిధిలోని అగ్గనూర్ లో గల మారుతి కాటన్ మిల్లు వద్ద CCI వారు ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు ఈ బ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని CCI వారికి సూచించిన ఎమ్మెల్యే, అలాగే రైతులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందాలంటే పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఎవ్వరు కూడా దళారులను ఆశ్రయించవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, డైరెక్టర్లు, సీసీఐ యాజమాన్యం,కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

