బిఆర్ఎస్‌పై నాగప్ప ఫైర్

 

తాండూర్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశలో అడుగులు

తాండూర్ అభివృద్ధికి మనోహర్ రెడ్డి దిశానిర్దేశం

బిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం – ప్రజల తీర్పే సాక్ష్యం

ఓటమి జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం: బిఆర్ఎస్‌పై నాగప్ప విమర్శలు

తాండూర్, manasa news ప్రతినిధి :కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప బిఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ పాలనలో తాండూర్ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరగకుండా కేవలం అంగులు ఆర్భాటాలకు మాత్రమే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. అందుకే ప్రజలు స్పష్టమైన తీర్పుతో వారిని తిరస్కరించారని తెలిపారు.ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పుడు తాము చేయని పనులను కూడా తమవిగా ప్రచారం చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. కోట్పల్లి–జంటుపల్లి ప్రాజెక్టు,లు మైల్వార్ రహదారి, పోతంగల్–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.ప్రస్తుతం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని నాగప్ప ప్రశంసించారు. పేదల సమస్యలను అర్థం చేసుకొని, వారికి ఇబ్బందులు కలగకుండా పరిష్కారాలు చూపుతున్నారని పేర్కొన్నారు.ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేక బిఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలకు దిగుతున్నారని అన్నారు. మీ హయాంలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని, ముఖ్యంగా తాండూర్ యువతకు మీరు ఇచ్చిన మెసేజ్ ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజలతో అన్యోన్యతగా మెలుగుతూ తాండూర్‌ను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తాండూర్ అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే సామర్థ్యం ఆయనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా అభివృద్ధి ఆగదని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు మనోహర్ రెడ్డి అని నాగప్ప స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *