దత్త కటాక్షాలతో సుభిక్షం

 

సహజ సిద్ధ రంగులతో హోలీ జరుపుకోవాలని పిలుపు

అన్నం పరబ్రహ్మ స్వరూపం – అన్నదానం గొప్పదని పేర్కొన్న విఠల్ నాయక్

భక్తులకు అన్నసమర్పణ నిర్వహించిన వర్త్య విఠల్ నాయక్ దంపతులు

హోలీ పౌర్ణమి సందర్భంగా ఘాన్ గాపూర్‌లో ప్రత్యేక పూజలు

దత్తాత్రేయ స్వామి కరుణతో సర్వం సుభిక్షం కావాలి – వర్త్య విఠల్ నాయక్

గానుగాపూర్, manasa news ప్రతినిధి :దత్తాత్రేయ స్వామి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ ఆకాంక్షించారు. మంగళవారం హోలీ పౌర్ణమి సందర్భంగా ఘాన్ గాపూర్ త్రివేణి సంగమంలో వర్త్య విఠల్ నాయక్ దంపతులు పవిత్ర నది స్నానం ఆచరించి, దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మనసారా దీవించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు.హోలీ పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు వర్త్య విఠల్ నాయక్ దంపతులు అన్నసమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర్ణమి రోజున చేసే పూజలు, దానధర్మాలు జన్మజన్మల పాపాలను నివారిస్తాయని తెలిపారు. అన్ని దానాలకన్నా అన్నసమర్పణ గొప్పదని, “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *