రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒకరికి ఆదర్శం.

రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒకరికి ఆదర్శం.

అందరివాడు డాక్టర్ అంబేద్కర్.            

తాండూర్ మాజీ ఎమ్మెల్యే-పైలెట్ రోహిత్ రెడ్డి 

అగ్నిజాల ప్రతినిధి తాండూర్ :

రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా యాలాల మండల దేవనూరు గ్రామంలో డాక్టర్ అంబేద్కర్, శివాజీ మహారాజ్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేటి యువత అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, బీ ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *