సైన్స్ ఫెయిర్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేత
—ఘనంగా వాలీడిక్టరీ సెరిమోనీ కార్యక్రమం
—విద్యను అభ్యసించి భావి భారత నిర్మాణంలో భాగస్వా ములు కావాలని పిలుపు
—చదువుతోనే సమాజంలో మనిషికి గుర్తింపు
—శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలి
—హైదరాబాద్ అర్చ్ డయాసీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రైజరర్
పసల ఇన్నయ్య
అగ్ని జ్వాలా ప్రతినిధి: తాండూర్
తాండూర్:వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సెయిం ట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నేష నల్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ 2024-25 , వాలీడిక్టరీ సెరిమో నీ కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు. ముందుగా సైన్స్ ఫెయిర్ లో నైపుణ్యం ప్రదర్శించి గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ చేతులమీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బం గా స్కూల్ కి చెందిన విద్యార్థి ని, విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. హైదరాబాద్ అర్చ్ డయాసీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రైజరర్పసల ఇన్నయ్య మాట్లాడు తూ.. సైన్స్ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని అన్నారు. మిసైల్ మెన్ ఆఫ్ గా పేరు పొందిన ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చదువుతోనే సమాజంలో మనిషికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో గౌరవ అతిధి భాస్కర్, సెయింట్ మార్క్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డి, సెయింట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ జోసెఫ్,సతిషన్, ప్రియదర్శిని, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
..

