బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తుంది.

 

జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

రాజ్యాంగం మార్పునకు కుట్ర – 

అగ్నిజ్వాల ప్రతినిధి: తాండూర్

పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామం, ఓమ్లా నాయక్ తాండలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  యాత్రలో పాల్గొన్న ఇన్చార్జి ఫహీం ఖురేషి , రాజీవ్ రెడ్డి ఈ సంధర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ…కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టసభ వేదికగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ని అవమానించడంతో పాటు, రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ కుట్ర పన్నుతుంది.ఆ కుట్రలను తిప్పికొడుతూ గ్రామ గ్రామాన బీఆర్ అంబేడ్కర్, బాపు, రాజ్యంగం గొప్పతనాన్ని తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగాలని మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలన్నారు.బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తుంది.రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఎంతో శ్రమకూర్చి రచించిన రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాలు దక్కుతున్నాయి.దేశంలోని పెద్ద కుబేరుల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుంది.పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలకు చేసింది ఏమీ లేదు.మతాల మధ్య చిచ్చు పెట్టి ఐక్యంగా ఉన్న ప్రజలు రెచ్చగొట్టి విడగొడుతుందని విమర్శించారు.రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటు పడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు..సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *