వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
చేయడం ఆభినందయమని తాండూర్ పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్, సుభాష్ తదితరులు అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా
తాండూర్ పట్టణంలోని కోర్టు ముందు లీడర్ పెంటయ్య సేవా మండలి చలి వేంద్రాన్ని వడ్డే శ్రీనివాస్, సుభాష్,తదితరులు చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన శ్రీ లీడర్ పెంటయ్య సేవా మండలిని అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెెస్ నాయకులు నర్సిములు, రామలింగం,ఖచ్చి ఓవైసీ, జిలాని, నారా శ్రీకాంత్, గొల్ల అనంతయ్య, బాలకృష్ణ,
సేవా మండలి తదితరులు పాల్గొన్నారు.

