ప్రజావ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజా వెతిరేకంగా ఉందని తెలియజేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా CPM జిల్లా కార్యవర్గ సభ్యులు కే. శ్రీనివాస్, యు.బుగ్గప్పలు మాట్లాడుతూ*….కేంద్రం బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం ప్రజల మౌనిక వసతులను కేటాయింపులు తగ్గించి, సంపనులకు రాయితులు పెంచిందని,సామాన్య ప్రజలకు తీరని ద్రోహం చేసింది అని విమర్శశించారు.
అదే విదంగా వ్యవసాయ ఉత్తుపతులకు కనీస మద్దతుధర కల్పించాలని,ప్రభుత్వరంగాన్ని పైవేట్ వారికీ అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50%నిధులు పెంచాలని,పట్టణాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని అన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి సబ్సిడీ పెంచాలని, మహిళా శిశు సంక్షేమం నిధులు కేటాయించి, స్కీమ్ వర్కర్లకు గౌరవ వేతనంలో కేంద్రం వాటా పెంచాలని అన్నారు. ప్రత్యామ్నాయ ప్రతిపాదనతో పార్లమెంట్లో ఫైనాన్స్ ఆమోదం చేయాలని డిమాండ్ చేశారు.
లేనిచో దేశవ్యాప్తంగా CPM, వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను ఐక్యపరిచి ఆందోళన ఉదృతం చేశామని కేంద్ర ప్రభుత్వన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం CPM,నాయకులు మహిబూబ్,రాజు,లాలప్ప, వెంకటేష్ధనియాలు బాలస్వామి శేఖర్,తదితరులు పాల్గొన్నారు..

