గత 10 రోజులుగా బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమ ఫలితమే రీ సర్వే
కులగణన రీ సర్వే బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
సర్వేలో పాల్గొనని బీసీ ప్రజలంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బీసీ సంఘం సర్వే సిబ్బందికి సహకరిస్తుంది
–జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
తాండూర్ :అగ్నిజ్వాల ప్రతినిధి
రాష్ట్రంలో మరోసారి కులగణన సర్వే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించడాని స్వాగతిస్తున్నామని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు గతవారం రాష్ట్రంలో జరిగిన కుల గణన సర్వేను ప్రభుత్వం విడుదల చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో సర్వే జరగలేదని రాష్ట్రంలోని అనేక బీసీ సంఘాలు మేధావులు నిరసన వ్యక్తం చేశారు ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సర్వేను పూర్తిగా వ్యతిరేకిస్తూ రీ సర్వే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందుకు అనుగుణంగా ఈనెల 16 నుండి 28 వరకు కుల గణన సర్వే నిర్వాహనకు ప్రభుత్వం అవకాశం కల్పించడం స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధతకు మార్చ్ మొదటి వారంలో అసెంబ్లీలో చట్టం చేయాలని నిర్ణయించడాని స్వాగతిస్తున్నామని అన్నారు ఇప్పటివరకు కుల గణనలో పాల్గొనని బీసీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలు నమోదు చేసే సర్వే సిబ్బందికి బీసీ సంఘం పూర్తి సహకారం అందిస్తుందని రాజ్ కుమార్ అన్నారు

