హడావుడిగా కులగనన సర్వే చేయటం సరైనది కాదు..
పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్.
అగ్ని జ్వాలా ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కులగనన సర్వే చేయటం సరైనది కాదు అని, రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ కులాలు ఎన్ని ఓట్లు ఉన్నవి అని తెలపకుండా తూతూమంత్రంగా చేపట్టటం సరైనది కాదని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ….కంటే కేశవ్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగనన ఆమోద్య యోగంగా లేదన్నారు. బీసీ కులాల ఓట్లు అధికంగా ఉన్నాయని, గత సర్వేలో ఎక్కువ శాతం వస్తే ఈసారి తక్కువగా వచ్చాయని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల వారీగా ఎస్సీల బీసీల ఓసీల ఎస్టీల ఓట్లను కులగనలను వివరించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఒక్కటై అధిక సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

