వాసవి క్లబ్ మరియు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు
*విద్యార్థుల కు నోట్ పుస్తకాలు పెన్లు పంపిణి
అగ్ని జ్వాలా ప్రతినిధి :
స్థానిక మండల కేంద్రం లో గల గీతంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో వసంత పంచమి సందర్బంగా వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా సరస్వతి దేవి విగ్రహానికి పూల మాలలు వేసి ప్రత్యేక పూజ కార్యక్రమం లు నిర్వహించారు అనంతరం విద్యార్థుల కు నోట్ పుస్తకాలు పెన్లు పలకలు పంచారు ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులుగా విచ్చేసిన వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ కో ఆర్డినేటర్ దారా మల్లికార్జున రావు మరియు ఆర్య వైశ్య మహా సభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దారా యుగంధర్ లు విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అందరు క్రమ శిక్షణ తో కూడిన చదువు చదవాలి అని ఉపాధ్యాయ లను గౌరవించి వారి చెప్పినా విద్య బుద్ధులను అలవార్చుకోవాలి అని ఈ గీతంజలి స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు అని మీరు కూడా ఉన్నత శిఖరాలు చేరాలి అని అన్నారు ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపాల్ మెడిది వెంకట రత్నం దమ్మపేట మండల మరియు పట్టణ అధ్యక్షులు పసుమర్తి రాంబాద్రం, దారా ప్రసాద్, వాసవి క్లబ్ అధ్యక్షులు మండవల్లి సురేష్, అత్తులూరి పోసి,ప్రదీప్ వినోద్, మనో, జగదీష్, సాయి, స్కూల్ ఉపాధ్యానీ, ఊధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

