రేగొండ: అగ్నిజ్వాల ప్రతినిధి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్ల పల్లె గ్రామంలోని…
ఎలాంటి తప్పు చేయకున్న…తనను అన్యాయం గా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇష్ట మొచ్చినట్లు రేగొండ ఎస్సై కొట్టాడని వెంకటేశ్వర్ల పల్లికి చెందిన గాజే వీరస్వామి ఆరోపించారు.
గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లికి చెందిన గాజే వీరస్వామి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు..తన మామ.కు సంబంధించిన భూ వివాదం లో తనకు సంబంధం లేకున్నా ఎస్సై పోలీస్ స్టేషన్ కు పిలిపించి తనను విచక్షణ రహితంగా కొట్టాడని , ఎస్సి, ఎస్టీ కేస్ పెడతానని బెదిరించాడని గాజే వీరస్వామి ఆరోపించారు.. అన్యాయం గా తనను కొట్టిన ఎస్సై పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కి, సీఐ కి ఫిర్యాదు చేసినట్లు వీరస్వామి తెలిపారు.
ఈ విషయం పై రేగొండ ఎస్సై వివరణ కోరగా గాజే వీరస్వామి మీద భూ భూ తగదాలే కారణం భూ తగాదాలే కారణమా భూ తగాదాలే కారణమా తగాదాల నేపత్యం లో ఈ నెల 17 వ తేదీన ఎఫ్. ఐ.ఆర్ నమోదు అయ్యిందని, ఆ విషయంలో స్టేషన్ కు పిలిపించామని ఎస్సై తెలిపారు..తన పై చేయి చేసుకోలేదని,
స్టేషన్ ఆవరణలో ఇతరులతో వీరస్వామి వాగ్వాదానికి దిగాడన్నారు…కావాలనే గాజే వీరస్వామి ఆరోపణలు చేస్తున్నారని ఎస్సై వివరించారు.

