తాండూర్ :అగ్నిజ్వల ప్రతినిధి :
విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
గత రెండు రోజుల క్రితం తాండూరు మున్సిపల్ పరిధిలో సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో జరిగిన సంఘటనపై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిలపై తెలుసుకొని దైర్యంగా ఉండాలని విద్యార్థులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ గారితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాస్టల్ లో జరిగిన సంఘటన బాధాకరం, కానీ ప్రతిపక్ష నాయకులు దీనిని రాజకీయం చేస్తూ రాజకీయ లబ్ధి పొందలనుకోవడం సిగ్గు చేటు.
విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది,అందురూ కూడ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు.
జిల్లా కలెక్టర్ గారు మూడు రోజులుగా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
హాస్పిటల్ లో ఉంచుతే పిల్లలు భయబ్రాంతులకు గురి అవుతారనే ముఖ్య ఉద్దేశంతోనే పిల్లలను హాస్టల్ వాతావరణంలోనే ఉంచి పూర్తిగా నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం.
పిల్లలందరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు, ఎవ్వరికైనా అత్యవసరం అయితే జిల్లా ఆస్పత్రిలో ఉంచి వైద్య సేవలు అందిస్తాము. పిల్లలకి నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉంది, దీనిలో భాగంగానే ఇప్పటికే మెస్ ,కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగింది.
మీడియా కవరేజ్ కోసం ప్రతిపక్ష నాయకుల తాపత్రయం యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు..
పిల్లలందరూ దేవతలతో సమానమని,ఇలాంటి విషయాల్లో రాజకీయం చేయడం మంచిదికాదని ప్రతిపక్ష నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

