తాండూర్ :అగ్నిజ్వల ప్రతినిధి :సిపిఎం వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు లాగచర్ల గ్రామ సందర్శన కార్యక్రమం సందర్బంగా అరెస్టు చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ ఎస్ ఎఫ్ ఐ తాండూర్ నాయకులు నవీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని దౌర్జన్యంగా అక్రమంగా పేదల నుండి భూములు లాక్కోవడాన్ని రైతులను భూ నిర్వాసితులను చేయడం దుర్మార్గమన్నారు ప్రజా పాలన పేరుతోనే మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులని కార్మికులను ప్రజలను నట్టేట ముంచే రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ పాలను కొనసాగిస్తూ నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు సిపిఎం నాయకులను అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని హెచ్చరించారు..
లగచర్ల ఘటన దురదృష్టకరం
మేము ఫార్మా కంపెనీలకు మా భూములు కు ఇవ్వము,అని రైతులు గత కొన్ని నెలలుగా చేస్తున్న ధర్నాలు దీక్షలు చేపట్టారు
రైతుల బాధ ఆవేదన కనిపించలేదా,వినిపించలేదా
రైతుల గోస పట్టించుకోకుండా వినిపించుకోకుండా గ్రామంలోకి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులను పంపించడం అంటే ఏమనుకోవాలి
రైతుల దీక్ష చేపట్టిన కూడా,కాదు కావలి అని బలవంతం చేయడం సబబేనా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ జిల్లా మీ నియోజక వర్గం లో ఈ గ్రామాలకు మీరు స్వయంగ వచ్చి రైతుల తో మాట్లాడలేరా..