* గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు వెంటనే చెల్లించాలి
తెలంగాణ గ్రామ పంచాయతీ వెల్ఫేర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా
వికారాబాద్ : అగ్ని జ్వాలా ప్రతినిధి :సిఐటియు గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది సిఐటియు ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఉద్యోగ భద్రత ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పెండింగ్ జీతాలు చెల్లించాలని అధికారుల వేధింపులు అరికట్టాలని అక్రమ తొలగింపులు అరికట్టాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని పర్మినెంట్ చేయాలని . కార్మికుల కష్టాన్ని గుర్తించకుండా మల్టీ పర్పస్ జీవో నెంబర్ 51 తీసుకురావాలి కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నాం ఇప్పుడు ఒకరి జీతం ఇద్దరికీ సరిపెట్టడం సరికాదన్నారు సరైన వేతనం ఇస్తుందని కార్మికులందరూ కోరుకుంటున్నారు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు