సమగ్ర కుల గణన ఈ నెల 06నా ప్రారంభం

 ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

 

నిర్వహించిన విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి 

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,పరిగి శాసనసభ్యులు రాంమెహన్ రెడ్డి గారితో కలిసి *పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.

 

ఎన్నికల సమయంలో వరంగల్, కామారెడ్డి బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం లో చేయని విధంగా సమగ్ర కుల గణన ఈ నెల 06 నుంచి ప్రారంభం కానుంది.
– గతంలో జరిగిన సర్వేల మాదిరిగా కాకుండా పూర్తి సమాచారం స్వీకరించడానికి బిసి కమిషన్ ప్లానింగ్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది.
– ఇది కేవలం సమగ్ర కులగణన కాదు, సామాజిక, ఆర్థిక, రాజకీయ, వృత్తి పరమైనఅంశాలను తెల్చే ఓ గొప్ప సామాజిక గణన అని చెప్పవచ్చు.
– ఈ సమగ్ర కుల గణన ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో సరైన అర్హులని గుర్తించడానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
– దీనికి ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు ,కులం సంఘాలు అందరూ భాగస్వామ్యం కావాలి.
– గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి సమచార సేకరణక సమయంలో పూర్తిగా సహకరించాలి.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల అధ్యక్షులు, చైర్మన్లు,వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల,నాయకులు,కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *