భక్తిశ్రద్ధలతో అంబురామేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన విజయలక్ష్మి
అంబురామేశ్వరుని సన్నిధిలో కంజర్ల విజయలక్ష్మి
పెద్దేముల్: manasa news ప్రతినిధి :తట్టెపల్లి గ్రామంలో అంబురామేశ్వర జాతర సందర్భంగా కంజర్ల విజయలక్ష్మి అంబురామేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ పరిసరాలను సందర్శించిన ఆమె, జాతరకు తరలివచ్చిన భక్తులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అంబురామేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.అంబురామేశ్వర జాతర మన ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కంజర్ల విజయలక్ష్మి పేర్కొన్నారు.

