తాండూర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తాండూర్: manasa news కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు తాండూర్‌లో పర్యటించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించనున్నారు.అప్పా జంక్షన్‌–మన్నెగూడ జాతీయ రహదారి పనులు, వికారాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం తాండూర్ మండలంలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన సాందీపని గురుకుల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం తాండూర్ వీరశైవ ఫంక్షన్ హాల్లో నిర్వహించే బీజేపీ జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.