పేద యువతకు పోలీస్ ఉద్యోగాల కల సాకారం చేసే దిశగా.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అడుగు
యువత భవిష్యత్తే లక్ష్యం.. ఉద్యోగ కలలకు అండగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్: manasa news :పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న తాండూర్ నియోజకవర్గ యువతీ యువకులకు మంచి అవకాశం కల్పిస్తూ తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి.పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు అవసరమైన రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌తో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలపై నిపుణులచే శిక్షణ అందించనున్నారు.ఈ సందర్భంగా తాండూర్ అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి ఉద్యోగ అవకాశాల్లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.తాండూర్ నియోజకవర్గంలోని ఆసక్తి, అర్హత కలిగిన యువతీ యువకులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని కోరారు.యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తూ వారి ఉద్యోగ కలలను సాకారం చేసేందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేస్తున్న కృషిపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.

