“తాండూర్ దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం!”
తాండూర్‌లో శ్రీ సద్గురు పోట్లి మహారాజ్ దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం
రాజగోపుర నిర్మాణానికి భూమి పూజ… తాండూర్‌లో ఘనంగా కార్యక్రమం
manasa news ప్రతినిధి :తాండూర్ పట్టణంలోని శ్రీసద్గురు పోట్లి మహారాజ్ దేవస్థానం అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. దేవస్థానం రాజగోపుర నిర్మాణం మరియు దుకాణముల పునఃనిర్మాణ కార్యక్రమాల కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధి ద్వారా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించడమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు.దేవస్థానం పునర్నిర్మాణంతో భక్తులకు సౌకర్యవంతమైన వసతులు అందుబాటులోకి వస్తాయని, పట్టణానికి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

