పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ

 

గురుకుల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందజేసిన LNR వ్యవస్థాపకులు లొంకా నర్సిములు 

పెద్దేముల్ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

పెద్దేమూల్ manasa news ప్రతినిధి:పెద్దేముల్ మండలంలోని ఎస్సీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా సీనియర్ నాయకులు, LNR యువసేన వ్యవస్థాపకుడు లొంక నర్సింలు పరీక్ష ప్యాడ్స్‌ను అందజేశారు.ఈ సందర్భంగా లొంక నర్సింలు మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. గురుకుల పాఠశాల విద్యార్థులు చదువులో ముందంజలో ఉండి మంచి ప్రతిభ కనబరచాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *