ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఓగిపూర్ గ్రామ
స్తుల కృతజ్ఞతలు
ఓగిపూర్ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో కొత్త రహదారి
దశాబ్దాల సమస్యకు పరిష్కారం… ఓగిపూర్‌లో రోడ్డు పనులు ప్రారంభం
ఓగిపూర్ – శతర్‌శాల రహదారి నిర్మాణానికి శ్రీకారం
తాండూర్ manasa news ప్రతినిధి తాండూర్ మండలం ఓగిపూర్ గ్రామ శివారులో ఓగిపూర్ నుండి కర్ణాటక సరిహద్దు గ్రామమైన శతర్‌శాల వరకు చాలా సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రహదారి లేకపోవడంతో గ్రామ ప్రజలు రాకపోకలకు అనేక కష్టాలు పడుతూ వచ్చారు.ఈ సమస్యను గుర్తించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంతంలో కొత్త రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రహదారి నిర్మాణంతో ఓగిపూర్ గ్రామంతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని గ్రామస్తులు తెలిపారు.ఈ సందర్భంగా ఓగిపూర్ గ్రామ సర్పంచ్ మ్యాతరీ నారాయణ, ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.

