పన్ను చెల్లించండి – అభివృద్ధికి తోడ్పడండి
తాండూర్‌లో ఆస్తిపన్ను వసూలు వేగవంతం
బకాయిలపై రెడ్ నోటీసులు – కమిషనర్ హెచ్చరిక
ఇంటింటి పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలు
పన్ను చెల్లించి అభివృద్ధికి తోడ్పడండి – మున్సిపాలిటీ పిలుపు
100% టార్గెట్ దిశగా మున్సిపాలిటీ ఆస్తిపన్ను వసూళ్లు
తాండూర్, manasa news ప్రతినిధి:తాండూర్ మున్సిపల్ లో ఆస్తి పన్ను వసూలును 100 శాతం లక్ష్యంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ పి. మధుసూదన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. శనివారం తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్‌లో బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాత బకాయలు ఉన్న వారికి వెంటనే రెడ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి ఆస్తి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పన్ను వసూలులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, అరేయ్ రాములు, బిల్ కలెక్టర్లు మరియు వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

