*సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్న శిక్షణ శిబిరం ప్రారంభం
*వికారాబాద్‌లో కాంగ్రెస్ నాయకులకు 10 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
* సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సృజన్ అభియాన్ శిక్షణ శిబిరం ప్రారంభం
వికారాబాద్ manasa news ప్రతినిధి అనంతగిరి లోని హరిత రిసార్ట్ లో సంఘటన సృజన్ అభియాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. ఇట్టి కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, సిడబ్ల్యూసి మెంబర్ చల్లా వంశీచందర్ రెడ్డి,తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఏపిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ అనన్య, ఎమ్మెల్యే లు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి,వికారాబాద్ డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్, వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి,మరియు తదితరులు పాల్గొన్నారు…

