నకిలీ మానవ హక్కుల సంఘాలపై

manasa news  :ప్రతినిధి

నకిలీ wమానవ హక్కుల సంఘాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉక్కుపాదం
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) పేరును దుర్వినియోగం చేస్తూ పనిచేస్తున్న నకిలీ సంస్థలపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి సంస్థలను గుర్తించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

తమ పేరును పోలిన పేర్లతో రిజిస్టర్ అయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సంస్థలు కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఢిల్లీలో రిజిస్టర్ అయి ఇతర రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ నకిలీ సంస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ప్రజల్లో గందరగోళం నివారించడమే ఈ నిర్ణయ లక్ష్యమని కమిషన్ స్పష్టం చేసింది.