ప్రగాఢ సానుభూతితో సహాయం అందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంపత్ కుమార్
మంతటి గ్రామంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన బీవీజీ ఫౌండేషన్
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన డాక్టర్ సంపత్ కుమార్
మానవత్వం చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్
అగ్నిజ్వాలా ప్రతినిధి తాండూర్
మానవత్వం చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్ బషీరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన ఎస్సీ లక్ష్మప్ప అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్
ఈ సందర్భంగా, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అనంత్ రెడ్డి పటేల్, ఆనంద్ పటేల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.డా క్టర్ సంపత్ కుమార్ ఈ సందర్భం లో మాట్లాడుతూ – “సమాజంలో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, మనవంతు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ దిశగా బీవీజీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుంది” అని పేర్కొన్నారు.

