తాండూర్ ధర్నాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణుల పాల్గొనడం
కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలు: బీఆర్ఎస్ మీడియా ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి
కాంగ్రెస్ కుట్రలపై తాండూర్‌లో బీఆర్ఎస్ ధర్నా
అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్
కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం అంబేద్కర్ చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్బంగా బీఆర్ ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి పంజుగుల
మాట్లాడుతూ..కాంగ్రెస్ డైవర్ష న్ డ్రామాలు అని..ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక బురద జల్లే విధానాలు అని అన్నారు.పీ సీ ఘోష్ రిపోర్ట్ ,పిసిసి రిపోర్ట్ అబద్ధాలకు కేర్ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అన్నారు.సిబిఐ అంటే కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలు కలిసి కాళేశ్వరం పై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

