*బీసీ రిజర్వేషన్లపై రాజకీయ డ్రామా
*అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లు తగ్గించిన బిఆర్ఎస్
*అసెంబ్లీలో ఒక మాట కేంద్రంలో మరో మాట బిజెపి పార్టీ ద్వంత వైఖరి
*సర్వే డేటాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు
*బీసీ రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసమా రాజకీయ లబ్ధి కోసమా
–జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
అగ్నిజాల ప్రతినిధి తాండూర్
బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రతి పార్టీ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి బీసీ రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసమా రాజకీయ పార్టీల లబ్ధి కోసమా అని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా ఆవేదన వ్యక్తం చేశారుతెలంగాణలో స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్ర శాసనసభ మండలి లో ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పటికీ ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తుంది ఈ ప్రక్రియలో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ డ్రామాను నడిపిస్తున్నాయి అని అన్నారు తెలంగాణలో 56% బీసీ జనాభా ఉంది ప్రస్తుతం విద్యా ఉద్యోగాల్లో 29% , స్థానిక సంస్థలు 21 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమల్లో ఉంది బిఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లను పెంచడానికి తగిన చర్యలు తీసుకుకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుండడం విడ్డూరం ఉంది అని రాజకుమార్ అన్నారు అదేవిధంగా బిజెపి పార్టీ రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పటికీ కేంద్రంలో దీనిని తొమ్మిదవ షెడ్యూల్డ్ లో చేర్చడానికి ఆసక్తి చూపడం లేదని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాయి తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలవుతే ముస్లిమ్స్ లాభపడతారని బిజెపి ఆరోపించడం వారి ద్వంత వేకరికి నిదర్శనం అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీ రిజర్వేషన్ బిల్లుని శాసనసభలో ఆమోదింపజేసింది అయితే ఈ సర్వే డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం పబ్లిక్ డొమైన్ లో ఉంచలేదని బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నాయిస్వార్థ రాజకీయాలని పక్కనబెట్టి సమానత్వం సామాజిక న్యాయం కోసం బీసీ రిజర్వేషన్లు బిల్లును అమలు కొరకై చిత్తశుద్ధితో అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని కందుకూరి రాజ్ కుమార్ కోరారు