ఆరోగ్య వివరాలు తెలుసుకున్న తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారికి కొత్త చూపు, కొత్త ఆశను ఇవ్వడమే నర్సింహులు  స్ఫూర్తికర సేవ.”

ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నిజమైన నాయకుడు.”

పార్టీకి అవసరమైనప్పుడు ముందుండే ధైర్యవంతుడు.”

అగ్నిజాల ప్రతినిధి: తాండూర్

తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు శ్రీ లంక నర్సింహులు ప్రస్తుతం అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తాండూర్ ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ ధారాసింగ్ హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.లంక నర్సింహుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో తెలుసుకున్న వారు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం చేసిన సేవలు మరువలేనివని కొనియాడుతూ, ఆయన త్వరితగతిన ఆరోగ్యవంతులై తిరిగి ప్రజాసేవలో చేరాలని ఆకాంక్షించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *