అగ్ని జ్వాల ప్రతినిధి :తాండూర్
యాలాల జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల లో మధ్యాహ్న భోజనం నాణ్యత లేదంటున్న విద్యార్థులు
అధికారులు వచ్చిన సమయంలో మాత్రమే రుచికరంగా ఉంటాయని వెల్లడి
నీళ్ల చారు ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు వెల్లడి
అది తినలేకనే హాస్టల్లో మాత్రమే తింటున్నామని హాస్టల్ విద్యార్థు లు పేర్కొంటున్నారు
అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతున్న విద్యార్థి
వికారాబాద్ జిల్లా మండలం పరిధిలోని యాలల గ్రామంలో ఉన్న బాలుర ఉన్నత పాఠశాల జడ్పీహెచ్ఎస్ లో మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా పోతుందని విద్యార్థులు వెల్లడిస్తున్నారు అధికారులు తనిఖీలకు వచ్చినపుడు మాత్రం బాగుంటుంద తెలిపారు ఆ తర్వాత ఉడికి ఉడకని అన్నం నీళ్ల చారు తప్ప మరొకటి పెట్టడం లేదని పేర్కొంటున్నారు దీంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు రాత్రి పెట్టే అన్న మాత్రమే కడుపునిండా తింటున్నామని పేర్కొంటున్నారు మధ్యాహ్నం భోజనం విషయంలో మెనూ పాటించకపోవడం వలన ఇష్టం వచ్చినట్లుగా వంటలు చేయడంతో భోజనం చేయలేక అనారోగ్యం పరిస్థితికి తలెత్తిన పరిస్థితి నెలకొంది ఎల్లాల జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అశ్వంత్ కుమార్ కు విపరీతమైన జ్వరం రావడం తో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చేరి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఒకవైపు అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ మనకు వైపు ఈ విధంగా నాణ్యమైన భోజనం పెట్టడం విద్యార్థుల అనారోగ్యాలకు దెబ్బతిస్తుందని పలువురు పేర్కొంటున్నారు ఇప్పటికైనా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజనం పై శ్రద్ధ వహించి నాణ్యత ఈతంగా ఉండే విధంగా ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు చేసే విధంగా చూడాలని విద్యార్థి తల్లిదండ్రులుగా విజ్ఞప్తి చేస్తున్నాను