కులం పేరుతో జరిగే దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు
కులం పేరుతో దూషించి బహిరంగంగా అవమానించిన అరెస్టు చేయని అధికారులు
కులం పేరుతో దూషించి బహిరంగంగా అవమానించి దాడి చేసిన అదే గ్రామానికి చెందిన పెత్తందారులను అరెస్టు చేయాలని డిమాండ్
అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్
ఎరుకల ST కుటుంబం పై దాడి చేసి కులం పేరుతో దూషించిన రమేష్ గౌడ్, నరేందర్ గౌడ్,నాని గౌడ్,నరేష్ గౌడ్,పవన్ గౌడ్ లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ ఎస్సీ ఎస్టీ ల పై దాడులు జరుగుతున్న పట్టించుకోని తాండూర్ డిఎస్పి పై వికారాబాద్ జిల్లా ఎస్పీ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రప్రధానకార్యదర్శి.వెంకట్రాములు డిమాండ్ తాండూరు మండలం చేనిగేష్ పూర్ గ్రామంలో ఎరుకల కులానికి చెందిన శారద బస్వరాజ్ కుటుంబం పై దాడి చేసిన అగ్రకుల పెత్తందారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారుఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ. తాండూరు మండలం చెన్ గేష్ పూర్,బెల్కటూర్ గ్రామాలలో బాధితుల పరామర్శించి ఈ సందర్భంగా మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాల లో ఎస్సీ ఎస్టీల కులం పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానించడం జరుగుతున్న స్థానికంగా తాండూరు ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఎస్సీ ఎస్టీలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా కఠినంగా శిక్షించకుండా నిర్లక్ష్యం చేస్తున్న తాండూరు డిఎస్పి పై చర్య తీసుకోవాలని దళిత యువకుడు పెండ్లి ఊరేగింపు బరాత్ ను అడ్డుకొని దాడి చేసిన సంఘటన మరువకముందే మరొక సంఘటన ఎరుకల కుటుంబం పై దాడి చేసి దౌర్జన్యం చేసిన అగ్రకుల పెత్తందారుల పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోద్ చేసి చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు మండలం చేనిగేష్ పూర్ గ్రామంలో ఎరుకల కుటుంబానికి చెందిన శారద బస్వ రాజ్ వారి తండ్రి కిష్టప్ప లక్ష్మి పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న గ్రామంలో రోడ్డుపైన రమేష్ గౌడ్ ఇంటి దగ్గర నానా బూతులు తిడుతూ కులం పేరుతో దూషించి బహిరంగంగా అవమానించి దాడి చేసిన అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన రమేష్ గౌడ్ నరేందర్ గౌడ్ నాని గౌడ్ నరేష్ గౌడ్ పవన్ గౌడ్ అందరు కలిసి ముక్కుమ్మడిగా ఎస్టీ ఎరుకల కుటుంబానికి చెందిన శారద బాలరాజు ను గ్రామంలో రోడ్డుపైన అడ్డుకొని దౌర్జన్యం చేసి బహిరంగంగా అవమానించి కులం పేరుతో దూషించిన దాడి చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ *ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ర్ మహిపాల్,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప, కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య,నాయకులు రఘపతి,నరేష్ బాధితులు, బస్వరాజ్, శారదా,నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

