*జయశంకర్ భూపాలపల్లి జిల్లా*
- *అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తాం*
*భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*
– మొదటి విడతలో ఇళ్లు రానివారు ఆందోళన చెందకండి..
అగ్ని జ్వాలా ప్రతినిధి:భూపాలపల్లి
వివిధ గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇళ్ల మంజూరీ పత్రాల పత్రాలను అందజేసిన *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* *రేగొండ మరియు కొత్తపల్లిగోరి మండలాల్లోని *జూబ్లీనగర్, రామన్నగూడెంతండా, భాగిర్తిపేట, దుంపిళ్లపల్లి, గూడెపల్లి, కొడవటంచ, మడతపల్లి, పొనగండ్ల, పోచంపల్లి, రంగయ్యపల్లి, రేపాకపల్లి, రేపాక, కనిపర్తి, రాయపల్లి, రూపిరెడ్డిపల్లి, చెన్నాపూర్, రేగొండ, పెద్దంపల్లి, జగ్గయ్యపేట, తిరుమలగిరి, నారాయణపూర్, కొత్తపల్లి(బీ)* గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై పత్రాలను అందజేశారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నిరోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పలువురు, ప్రజలు పాల్గొన్నారు.

