గ్రూప్ 1 గ్రూప్ 2 ఏకకాలంలో రెండింటిలో ఉద్యోగాలు

గ్రూప్ వన్ గ్రూప్ టూ లో  ఏకకాలంలో రెండింటిలో ఉద్యోగాలు సాధించిన తాండూరు యువకుడు కురువ క్రాంతి

అగ్ని జ్వాలా ప్రతి నిధి: తాండూర్

తాండూర్ కు చెందిన ప్రముఖ న్యాయవాది K. గోపాల్ ఉపాధ్యాయురాలు బాలమని కుమారుడు కురువ క్రాంతి, ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ గ్రూప్ టు ఉద్యోగాల పరీక్షలలో రాష్ట్రస్థాయిలో తన ప్రతిభను చాటుకుని రెండింటిలో ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది ఈ సందర్భంగా గోపాల్ సార్ నివాసానికి వెళ్లి వారి యొక్క కుమారుడిని ఘనంగా సన్మానించిన తాండూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్* సార్ దంపతులు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్స్ కొట్రిక విజయలక్ష్మి మేడం ,అలాగే తాండూర్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు అన్న,తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్, తాండూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ వరాల శ్రీనివాస్ రెడ్డి,భీమాసింగ్, అలాగే పాండు పూజారి,గుళి పరమేశ్వర్, ఫరీద్ అడ్వకేట్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *