–నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పననే
-ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి లక్ష్యం
–ఈనెల 29న జరిగే మెగా జాబ్ మేళానుసద్వినియోగం చేసుకోవాలి
–కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మాణిక్ రావు
అగ్నిజాల ప్రతినిధి :: వికారాబాద్ జిల్లా
నియోజకవర్గం లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పననే తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి లక్ష్యం అనిబషీరాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మాణిక్ రావు అన్నారు.తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప సువర్ణ అవకాశం గా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో ఈనెల 29న ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే మెగా జాబ్ మేళాను తాండూర్ నియోజకవర్గం నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగంచేసుకోవాలని బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మండల్ కురువ సంఘం ఉపాధ్యక్షుడు మాణిక్ రావు అన్నారు. ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాను తెలంగాణ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈ జీ ఎం ఎం) సహకారంతో 50 కంపెనీలతో దాదాపుగా పది వేల ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో విద్యా అర్హతగా పది,ఇంటర్,డిగ్రీ , పీజీ, బిటెక్ చదువుకున్న నిరుద్యోగులకు మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగ్, నర్సింగ్ తదితర రంగాలలో ఉద్యోగం కల్పిస్తారని తెలియజేశారు. ఈ అవకాశంతో నిరుద్యోగులు ఆయా రంగాలలో ఉద్యోగం పొంది ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. ఈ మంచి అవకాశాన్ని తాండూర్ నియోజకవర్గం లో నాలుగు మండలాల్లో యువత ముందుకు వచ్చి వారికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. ఇట్టి జాబ్ మేళా నిర్వహించిన తాండూర్ ఎమ్మెల్యే బియ్యాని మనోహర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అని మండల్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మానికిరావు అన్నారు.

