మే 20 దేశవ్యాప్తoగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని cituకార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే నాలుగు కార్మిక కోడ్ లను వెంటనే రద్దు చేయాలి
అగ్ని జ్వాలా ప్రతి నిధి:తాండూర్
సిఐటియుసిఐటియు ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో దేశవ్యాప్తంగా మే 20 న సమ్మె పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం భారతదేశంలో ఉద్యోగ కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే నాలుగు కార్మిక కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారుఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కనీస వేతనాలు చట్టం, ఉద్యోగ భద్రత చట్టం, 8 గంటల పని విధానం ,సంఘం పెట్టుకునే హక్కు ,సంఘటితంగా పోరాడే హక్కు సమ్మే హక్కు తదితర హక్కులతో కూడుకున్న అనేక చట్టాలన్నీ లేబర్ కోళ్లతో ఆవిరి అయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు బడాపెట్టుబడుదారులకు ,యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్ లూ వెనక్కి తీసుకునేదాకా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంపన్న వర్గాల ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఉన్నారు. ఈ విషయం పోర్బ్స్,హురున్ సంస్థల ప్రకటించిన ప్రపంచ ధనవంతుల జాబితాను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. దేశ సంపదనంతా బడా బాబులకు బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రజల ఆదాయాలు పెరగడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఆకలితో అలమటించే జనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 11 జాతీయ కార్మిక సంఘాలు మే 20న జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని , ప్రైవేటీకరణ విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయని వారు తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కుల, మత, విభజన రాజకీయాలు ఊపందుకున్నాయని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని విమర్శించారు. దేశ ఐక్యత కోసం, సమగ్రత కోసం కార్మిక వర్గం కులం మతం ప్రాంతాలను పక్కకు పెట్టి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చార కాంట్రాక్టర్ ఓట్ సోర్సింగ్ కార్మికులు స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కర్స్ మున్సిపల్ గ్రామపంచాయతీ మధ్యాహ్న భోజనం హమాలి కార్మికులు ప్రవేట్ డ్రైవర్స్ లోడింగ్ అన్ లోడింగ్ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రయ్య సిఐటియు నాయకులు భాగస్వామి ధాన్యాలు సంజీవ్ వినోద్

