ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ మనకు అందించారూ
అగ్నిజ్వాల ప్రతినిధి : అయిజ
అయిజ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండల కేంద్రంలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు_ యువకులు, పెద్దలు మాట్లాడుతూ దేశదేశాలు పర్యటించి వారివారి రాజ్యాంగాలను పరిశోధించి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ మనకు అందించారని, దళితులకు రిజర్వేషన్ కల్పన వంటి విప్లవాత్మక అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు,ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడానికి అని చెప్పుకొచ్చారు._ ప్రతి గుడిసెకు ప్రతి దళితుడికీ, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిన నాడే అంబేద్కర్ కల సాకారమవుతుందని యువకులు, పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయిజ మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు మాల వీరేష్,అయిజ మండల బిఆర్ఎస్వి అధ్యక్షులు బింగిదొడ్డి మత్తాలి,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న యాదవ్,మండల ఉపాధ్యక్షులు బైనపల్లి మైబు, బిఆర్ఎస్వి అయిజ టౌన్ మాజీ అధ్యక్షులు నరేష్,పత్రిక విలేకర్ రామకృష్ణ,మహేష్,మైబు,పరుశరాముడు,వి.రాజు,ఏలీయా,పరుశరాముడు, వినయ్,అంబేద్కర్ కమిటీ సభ్యులు,పెద్దలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

