కాంగ్రెస్ నాయకుడు ఫామ్ హౌస్ కు రోడ్ వేయడానికి ప్రజల డబ్బులను ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి సిపిఎం డిమాండ్

అగ్నిజ్వల ప్రతినిధి: తాండూర్

సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో సిపిఎం జిల్లా కార్యావర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ఇందిరమ్మ రాజ్యం పేరుతోనే స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్తూనే మరొకపక్క 60 లక్షల రూపాయలతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ హౌస్ కీ రోడ్ వేయడాన్ని తీవ్రంగా ఖండించారు తాండూర్ నియోజకవర్గంలో ఇలాంటి అరాచకం కాంగ్రెస్ ప్రభుత్వం చోటామోటా నాయకులు ప్రజాపాలన పేరుతోని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా ప్రజలకు రోడ్లు డ్రైనేజీ మంచినీటి సౌకర్యము ఇందిరమ్మ ఇండ్లు కల్పించకుండా నాయకులు యొక్క సొంత లాభల కోసం ఫామ్ హౌస్లకు రోడ్లు 60 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తూ ప్రజల యొక్క సొమ్ముని నాయకులు యొక్క రాజభోగాలకు వాడుకుంటూ లక్షల రూపాయలు కాజేస్తూ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అంటే పేదల పేరు చెప్పుకొని అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికి పనిచేస్తున్న అధికారులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యల కోసం అవినీతి అక్రమాలపై ప్రశ్నించే నాయకుల మీద దౌర్జన్యం దాడులకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాల్పడుతున్న ఇలాంటి అరాచకాలు చేసిన ఎన్నో ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే అధికారం నుండి గద్దె పరిస్థితి వస్తున్నది ప్రజలకు ఉపయోగపడే రోడ్లు డ్రైనేజీ ఇండ్లు పింఛన్లు రేషన్ కార్డులు ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిపోయి కాంగ్రెస్ నాయకుల సొంత లాభాల కోసం ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్నారా అరాచకాలని ఎండగట్టాలని పిలుపునిచ్చారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కే చంద్రయ్య కేఎన్పీఎస్ జిల్లా కార్యదర్శి జి రత్నం మైనార్టీ హక్కుల పోరాట సంఘం నాయకులు అబ్దుల్ వావ్ సిపిఎం ప్రజాసంఘాల నాయకులు సతీష్ మల్లేష్ పరుశరామ్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *